Take a fresh look at your lifestyle.

తప్పించడమా..! వదిలేయడమా..!?

0 21,378

(మెట్రో న్యూస్ బ్యూరో): బతకడమా… చావడమా! వేటు వేయాలా… వదిలేయాలా! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొం టున్నారు. ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన వైఖరి ఏమిటి..? తదుపరి చర్యలు ఏమిటి..? అనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అమెరికా పర్యటనకు కేంద్రం నో చెప్పడంతో అసహనంగా ఉన్న రేవంత్… కొందరు కాంగ్రెస్ నాయకుల తీరుతో ఆగ్రహంతో ఉన్నారు. ఇక మంత్రి కొండా సురేఖ కుటుంబం ఆయన్ను టార్గెట్ చేయడం భరించలేకపోతున్నారు! సీఎంకు అనుకూలురైన ప్రజాప్రతినిధులు అందరూ సురేఖను డిస్మిస్ చేయాల్సిందేనని పట్టుబడుతుండగా, సీనియర్ మంత్రులంతా జరుగుతున్న పరిణామాలను మోనంగా గమనిస్తున్నారు. ఇవన్నీ ఆగస్టు సంక్షౌభం తాలూకు ప్రకంపనలేనా! ఈ విషయాన్ని మెట్రో ఈవినింగ్స్ దినపత్రిక ఇదివరకే చెప్పింది.

 

రాష్ట్రంలో విపక్షాలపై ఒకవైపు పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌కు మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచీ అసమ్మతి పోటు తీవ్రమవుతోంది. మంత్రి సురేఖ కుటుంబం సభ్యులు, ముఖ్యంగా కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌ను కుదిపేశాయి. నేరుగా సీఎంనే సుస్మిత లక్ష్యంగా చేసుకున్నారు. బిడ్డ తిడితే… తల్లి సురేఖకు పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి నోటీసులు వెళ్లాయి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు. కూతురు వ్యాఖ్యలతో తనకేం సంబంధం లేదంటూ… క్రమశిక్షణ సంఘానికి ఆమె లేఖలు రాయడమే కాకుండా.. నేరుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోనే భేటీ అయ్యారు.

సీఎం విదేశాల్లో ఉండగానే… హైకమాండ్‌ను కలిసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మంత్రి సురేఖ ఫ్యామిలీ ధిక్కార స్వరంపై ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారు. ఇపుడు కూడా చర్యలు తీసుకోకపోతే… అసమ్మతి తారాస్థాయికి చేరి, పార్టీలో గందరగోళానికి దారితీస్తుందని సీఎం అనుయాయులు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తప్పిస్తేనే.. రేవంత్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకుల మా! లేదంటే… సీఎం బలహీనమవుతారు అనేది పొలిటికల్ కామెంట్! మరి ముఖ్యమంత్రి మాట హైకమాండ్ వింటుందా… మంత్రి సురేఖపై వేటు పడుతుందా అనేది చూడాలి. మొత్తానికి బంతి గాంధీల కోర్టులోకి వెళ్లింది. పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.