Take a fresh look at your lifestyle.

మిరాకిల్ హౌజ్ వ‌ద్ద సోనూ సూద్‌.. నేపాల్ వ‌ర‌ద స‌హాయంలో పాల్గొన్న న‌టుడు

0 9

Sonu Sood: బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్‌.. నేపాల్ వ‌ర‌ద బాధిత‌ల‌కు రిలీఫ్ మెటీరియ‌ల్ అందిస్తున్నారు. సోనూసూద్ ఛారిటీ క్ల‌బ్ త‌ర‌పున ఆయ‌న సాయం చేస్తున్నారు. త్రిశూలీ న‌ది ఒడ్డున వ‌ర‌ద‌ను త‌ట్టుకుని నిలిచిన లైట్ గ్రీన్ హౌజ్ వ‌ద్ద‌కు సోనూ సూద్ చేరుకున్నాడు.

కాట్మాండు: బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్‌.. నేపాల్ వ‌ర‌ద బాధిత‌ల‌కు రిలీఫ్ మెటీరియ‌ల్ అందిస్తున్నారు. నేపాల్‌లో ఆయ‌న స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. మంగ‌ళ‌వారం నేపాల్ వెళ్లిన న‌టుడు సోనూ సూద్ ఇవాళ ఉద‌యం త్రిశూలీ బ‌జార్‌ను విజిట్ చేశాడు. సోనూసూద్ ఛారిటీ క్ల‌బ్ త‌ర‌పున ఆయ‌న సాయం చేస్తున్నారు. ఆగ‌స్టు 26వ తేదీన సంభ‌వించిన వ‌ర‌ద‌ల్లో త్రిశూలీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న త్రిశూలీ గ్రామం, బ‌జార్ పూర్తిగా దెబ్బ‌తిన్న విష‌యం తెలిసిందే. కండ్ల ముందు చాలా విధ్వంసం జ‌రిగింద‌ని, దాని తీవ్ర‌త మ‌రీ అధికంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. త్రిశూలీ న‌దిలో బుర‌ద‌, బండ‌రాళ్ల‌తో కూడిన వ‌ర‌ద పోటెత్తుతున్నా.. ఓ ఇళ్లు మాత్రం చెక్కుచెద‌ర‌కుండా ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే ఆ లైట్ గ్రీన్ హౌజ్‌ను ఇప్పుడు మిరాకిల్ హౌజ్‌గా పిలుస్తున్నారు. ఆ ఇంటి స‌మీపానికి న‌టుడు సోనూ సూద్ చేరుకున్నారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఆ మిరాకిల్ ఇళ్లు ఎలా స‌జీవంగా నిలిచిందో చూడ‌వ‌చ్చు అని అయ‌న అన్నారు. ఆ ఇంట్లో ఆరుగురు పైక‌ప్పుపై నిలుచుని ప్రాణాలు కాపాడుకున్నారు.
సుమారు 9 గంట‌లు శ్ర‌మించిన త‌ర్వాత తాము త్రిశూలీ ప్రాంతానికి చేరుకున్న‌ట్లు సోనూ సూద్ చెప్పాడు. ఇక్క‌డ చాలా మంది ఇండ్లు , కుటుంబాలు కోల్పోయార‌ని, వారిని చూస్తుంటే బాధేస్తుంద‌న్నారు. చాలా క‌ఠినమైన ప్ర‌దేశాల‌కు చేరుకుని, వీలైనంత స‌హాయం చేయ‌నున్న‌ట్లు సోనూ సూద్ చెప్పాడు.

Leave A Reply

Your email address will not be published.