Take a fresh look at your lifestyle.

కొత్తగా నవోదయ స్కూల్, పారిశ్రామిక కారిడార్.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం

0 12

హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల బాలుర, బాలికల హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు.

కొత్త కోర్సులు, బస్సులు, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. నవోదయ స్కూల్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, బాసర ట్రిపుల్‌ ఐటీ బ్రాంచ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కబడ్డీ అకాడమీ, స్పోర్ట్స్‌ స్టేడియం, పారిశ్రామిక కారిడార్‌, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి వెల్లడించారు.

  • కొత్తగా నవోదయ స్కూల్, పారిశ్రామిక కారిడార్
  • హుస్నాబాద్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం
  • గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నంHusnabad Education Hub

హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎడ్యూకేషన్ హబ్‌గా మార్చబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బాలుర ,బాలికల హాస్టల్స్ నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన మంత్రి.. నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. మొదటి సంవత్సరంలో 240 మంది విద్యార్థులకు 60 మంది చేరితే వారికి సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు అందించామన్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో 120 మంది చేరారని చెప్పారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకొస్తామన్నారు. దాంతో పాటుగా నియోజకవర్గంలో నవోదయ స్కూల్, పారిశ్రామిక కారిడార్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు పొన్నం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.