Take a fresh look at your lifestyle.

BCCI | అండ‌ర్ -19 జ‌ట్టులో ఆర్య‌వీర్ సెహ్వాగ్.. వికెట్‌కీప‌ర్‌గా ద్ర‌విడ్ వార‌సుడు..!

0 21

BCCI : భార‌త దిగ్గ‌జాల వార‌సులు అంత‌ర్జాతీయ క్రికెట్‌వైపు వేగంగా దూసుకొస్తున్నారు. జూనియ‌ర్ స్థాయిలో అదగొడుతున్న‌ రాహుల్ ద్ర‌విడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అండ‌ర్ -19 జ‌ట్టులోకి వ‌చ్చేశారు.

BCCI | అండ‌ర్ -19 జ‌ట్టులో ఆర్య‌వీర్ సెహ్వాగ్.. వికెట్‌కీప‌ర్‌గా ద్ర‌విడ్ వార‌సుడు..!

BCCI : భార‌త దిగ్గ‌జాల వార‌సులు అంత‌ర్జాతీయ క్రికెట్‌వైపు వేగంగా దూసుకొస్తున్నారు. జూనియ‌ర్ స్థాయిలో అదగొడుతున్న‌ రాహుల్ ద్ర‌విడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అండ‌ర్ -19 జ‌ట్టులోకి వ‌చ్చేశారు. ఇటీవ‌ల నిల‌క‌డ‌గా రాణిస్తున్న అన్వ‌య్ ద్ర‌విడ్(Anvay Dravid), ఆర్య‌వీర్ సెహ్వాగ్‌(Aaryavir Sehwag)లు ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌కు ప్ర‌క‌టించిన బృందంలో చోటు ద‌క్కించుకున్నారు.

టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రాహుల్ ద్ర‌విడ్, వీరేంద్ర‌ సెహ్వాగ్‌ల కుమారులు అండ‌ర్‌-19 స్క్వాడ్‌కు ఎంపిక‌య్యారు. సెప్టెంబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ కోసం సెలెక్ట‌ర్లు ద్ర‌విడ్ పెద్ద‌బ్బాయి అన్వ‌య్ ద్ర‌విడ్, వీరూ పెద్ద కుమారుడు ఆర్య‌వీర్ సెహ్వాగ్‌లను తీసుకున్నారు.

వికెట్ కీప‌ర్‌గా అన్వ‌య్ త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకోగా.. ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో దంచేస్తున్న ఆర్య‌వీర్ అండ‌ర్-19 స్క్వాడ్‌లోకి మొద‌టిసారి ఎంపిక‌య్యాడు. యువ భార‌త్‌కు ల‌క్ష్య రాయ్‌చంద‌ని కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఆసీస్‌తో సెప్టెంబ‌ర్18న వ‌న్డే సిరీస్ మొద‌ల‌వ్వ‌నుంది. అలానే.. రెండు మ‌ల్టీ డే మ్యాచ్‌ల‌కు ప్ర‌త్యేక స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఈ మ్యాచుల్లో టీమిండియాకు య‌శ్‌బ‌ర్ధ‌న్ సింగ్ చౌహ‌న్ నాయ‌క‌త్వం వహించ‌నున్నాడు.

Leave A Reply

Your email address will not be published.