Take a fresh look at your lifestyle.

రూ.6 లక్షల సొంత నిధులతో దేవాలయ షెడ్ నిర్మించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

0 4

మెట్రో న్యూస్:

పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. నిరంతరం ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో భాగంగా సొంత నిధులతో నూతన దేవాలయాలు నిర్మిస్తూ తన భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. తాజాగా. బీరంగూడ డివిజన్ పరిధిలోని మండే మార్కెట్ శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆవరణలో 6 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన షెడ్డును శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు భక్తులు ఆలయానికి వచ్చే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా షెడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు
అలాగే దేవాలయ అభివృద్ధిలో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి మరింత సుందరంగా ౠతీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. గతంలోనూ ఆలయం సాలహారం నిర్మాణానికి రెండు లక్షల రూపాయల నిధులు అందించినట్లు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ ఆలయ కమిటీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి మాజీ ప్రజా ప్రతినిధులు బాలరాజు గోపాల్ ప్రమోద్ రెడ్డి కృష్ణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.